పవన్ కల్యాణ్ నిజాయతీ గురించి టాలీవుడ్‌లో కథలు కథలుగా చెబుతుంటారు. 'జానీ' సమయంలో బయ్యర్లను ఆదుకొన్న విధానాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. సర్దార్ - గబ్బర్‌సింగ్‌కీ అదే సీన్ రిపీట్ అవ్వబోతోంది. సర్దార్ సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు పవన్ కల్యాణ్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను ఇచ్చిన మాట నిలుపుకొంటూ.. పవన్ కొంతమంది డిస్టిబ్యూటర్లకు సొమ్ము వాపస్ చేసినట్టు తెలిసింది. పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సెప్టెంబరులో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. హారిక హాసిన క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ నిర్మాత. తాజాగా అయన ఈ సినిమాకి సంబధించి పవన్‌కి కొంత అడ్వాన్స్ ఇచ్చారు నిర్మాత.
No comments:
Post a Comment