Monday, 20 June 2016

పవన్ కళ్యాణ్.. భయమెందుకు ?


కాపుల కోసం పోరాటం చేస్తున్న మాజీమంత్రి ముద్రగడ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ . దీక్షలో ఉన్న ముద్రగడను పరామర్శించేందుకు వెళ్ళిన విహెచ్.. ఈసందర్భంగా పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. "పవన్ కల్యాణ్ కూడా నోరు విప్పాలండీ. వాస్తవాలు చెప్పేందుకు భయమెందుకురా బాబూ నీకు? రా. వాస్తవాలు చెప్పు. ఇప్పటికన్నా నోరిప్పు మిత్రమా. కాపుల ఉద్యమం తప్పంటే తప్పని చెప్పు. లేకుంటే తప్పుకాదని చెప్పు. రెండూ చెప్పకుంటే ఎలా?" అని అంటూ పవన్ పై ప్రశ్నలు సంధించారు విహెచ్.

No comments:

Post a Comment